కోనసీమ: మోంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజల భద్రత కోసం డీ.ఐ.జీ K.K.N.అంభురాజన్ ఆదేశాల ప్రకారం జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పర్యవేక్షణలో అమలాపురం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా జిల్లా వ్యాప్తంగా తుఫాన్ పరిస్థితిని 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు.