SKLM: తుఫాన్ వర్షాల కారణంగా బాధితులకు సహాయ, సహకారాలు అందించేందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ క్యాంపు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కంట్రోల్ రూమ్ సేవలు సోమవారం నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.