కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన మూవీ ‘కాంతార ఛాప్టర్-1’. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ ఏడాది భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. ఇక రుక్మిణి వసంత్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించారు.