ATP: జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఈ నెల 28న ఉదయం 9 గంటలకు అనంతపురంలోని JNTUసెంట్రల్ కంప్యూటర్ సెంటర్లో జరిగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షకు హాజరుకావాలని డీఎంహెచ్వో డాక్టర్ ఈ. బి. దేవి సూచించారు. అభ్యర్థులు పూర్తి వివరాలను జిల్లా అధికారిక వెబ్సైట్లో చూడవచ్చని తెలిపారు.