KRNL: రోడ్డుపై పడిన బైక్ నల్లరంగులో ఉండటంతో దూరం నుంచి సరిగా గుర్తించలేకపోయానని వేమూరి కావేరి బస్సు డ్రైవర్ లక్ష్మయ్య పోలీసులకు చెప్పాడు. వర్షంలో సడెన్ బ్రేక్ వేస్తే ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో ఆపకుండా బైకుపై నుంచి బస్సును పోనిచ్చినట్లు తెలిపాడు. కాగా ఈ ప్రమాదానికి ముందు 3 బస్సులు ఆ బైకును గుర్తించి పక్క నుంచి వెళ్లినట్లు సమాచారం.