karnataka Elections 2023: ఎలక్షన్ జరుగుతుండగానే హైదరాబాద్‌లో హోటల్ బుకింగ్స్.. కానీ ఎందుకు?
కర్ణాటక ఎలక్షన్స్ ట్రెండ్స్‌లో పూర్తిగా కాంగ్రెస్‌కి ఆధిక్యం కనిపిస్తోంది. ఎలక్షన్ రిజల్ట్స్ మొదలైన 2 గంటల్లోనే కాంగ్రెస్ ముందంజలోకి వచ్చింది. ఇలాంటి టైంలో హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లలో..
karnataka election 2013: కర్ణాటక ఎలక్షన్స్ ట్రెండ్స్‌లో పూర్తిగా కాంగ్రెస్‌కి ఆధిక్యం కనిపిస్తోంది. ఎలక్షన్ రిజల్ట్స్ మొదలైన 2 గంటల్లోనే కాంగ్రెస్ ముందంజలోకి వచ్చింది. ఇలాంటి టైంలో హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లలో హోటల్ రూంలు విపరీతంగా బుక్ కావడం చర్చలకు దారితీస్తోంది.
హైదరాబాదులోని ప్రముఖ హోటల్స్‌లో రూమ్‌ల పెద్ద సంఖ్యలో బుకింగ్ అయినట్టు తెలుస్తోంది. తాజ్ కృష్ణలో 18, పార్క్ హయత్‌లో 20 రూమ్‌లు, నోవాటెల్ హోటల్లో 20 రూమ్‌లు కర్ణాటకకు చెందిన వ్యక్తుల పేర్లతో బుక్ అయినట్టు తెలుస్తోంది. మరిన్ని హోటల్స్‌లో బల్క్ బుకింగ్స్ జరిగినట్టు సమాచారం.
కర్ణాటక, హైదరాబాద్‌కు సంబంధించిన వివిధ వ్యక్తుల పేర్లతో నిన్న బుక్ అయ్యాయి. అయితే ఈ హోటల్స్ బుక్ కావడానికి, కర్ణాటక ఎలక్షన్స్‌కి నిజంగానే సంబంధం ఉందా..? లేదా అనే దానిపై క్లారిటీ లేదు కానీ.. బుకింగ్ అవుతున్న తీరు, ఆ స్పీడ్ చూస్తుంటే మాత్రం కచ్చితంగా అనుమానాలకు తావిస్తోంది.