ఈ మధ్య హాట్ బ్యూటీ రష్మిక మందన పై కన్నడ వాసులు మండి పడుతున్నారు. కాంతార చూడలేదని చెప్పడంతో పాటు.. ఛాన్స్ ఇచ్చిన బ్యానర్ పేరు చెప్పలేదని.. ఓ రేంజ్లో కామెంట్స్ చేశారు. అంతేకాదు కన్నడలో బ్యాన్ చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయినా దీని పై రష్మిక స్పందించడం లేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది రష్మిక. వారసుడు, పుష్ప2, యానిమల్ లాంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. అయితే ఇప్పుడు మహేష్ సరసన ఐటెం సాంగ్ చేసేందుకు సై అన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో.. ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఇందులో ఓ సాలిడ్ ఐటెం సాంగ్ ఉండనుందని.. చాలా రోజులుగా వినిపిస్తోంది. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం..
ఈ సాంగ్‌ను రష్మికతో చేయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రష్మిక కూడా ఈ ఐటెం చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. గతంలో మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించింది రష్మిక. ఇక ఈ సాంగ్ కోసం రష్మికకు భారీ మొత్తంలో చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇలాంటి వార్తల్లో క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ రష్మిక స్పెషల్ సాంగ్ చేస్తే మాత్రం.. క్రేజీగా ఉంటుందని చెప్పొచ్చు. ఇకపోతే.. ఎస్ఎస్ఎంబీ28 కొత్త షెడ్యూల్‌ను డిసెంబర్లో మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. మరో బ్యూటీ శ్రీలీల కూడా ఫైనల్ అయిందని టాక్. దాంతో త్రివిక్రమ్ ఈ సినిమాలో గ్లామర్ టచ్ గట్టిగానే ఇస్తున్నాడని చెప్పొచ్చు.