AP: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అసంబద్ధమని టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కొట్టిపారేశారు. తమ పాపాలను కప్పిపుచ్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ఒక ‘బ్యాండ్ ఆఫ్ సైకోలు’గా మారినప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు.