మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని దేవుని గుట్ట వద్ద నూతనంగా నిర్వహించిన కాటమయ్య దేవాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. దేవాలయ నిర్మాణం పూర్తయి నేడు దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈనెల 24, 25 తేదీలలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు బోనాల వేడుకలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు.