‘ఆర్ఆర్ఆర్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత.. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ‘ఆర్సీ15’ ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం ఈ సినిమా న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా పై మెగాభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా.. గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు శంకర్.
ఇక ఈ సినిమా తర్వాత చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో ఉంటుందనే ఆసక్తి అందరిలోను ఉంది. ఎందుకంటే.. ఇప్పటికే కమిట్ అయినా గౌతమ్ తిన్ననూరి మూవీ క్యాన్సిల్ అయిపోయింది. దాంతో పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సానాతో ఉంటుందని వినిపించింది. అనుకున్నట్టుగానే ఈ క్రేజీ కాంబో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఆర్సీ16’ పాన్ ఇండియా ఎంటర్టైనర్గా.. పవర్ ఫుల్ సబ్జెక్ట్‌తో రాబోతుందని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌లో డైరెక్టర్ సుకుమార్ కూడా నిర్మాణ భాగస్వామ్యం కానున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.
త్వరలోనే మిగతా నటీనటుల వివరాలు తెలియనున్నాయి. ఇకపోతే.. సుకుమార్ శిష్యుడిగా ‘ఉప్పెన’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు.. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఇప్పటికే తారక్ కొరటాల, ప్రశాంత్ నీల్‌తో కమిట్ అవడంతో.. ఈ ప్రాజెక్ట్ చరణ్ దగ్గరికి వెళ్లింది. మరి సెకండ్ మూవీతోనే స్టార్ హీరోని పట్టేసిన బుచ్చిబాబు.. చరణ్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.