బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.170 తగ్గి రూ.1,30,690కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.1,19,800 వద్ద ఉంది. ఇటీవల భారీగా తగ్గిన వెండి ధర మాత్రం ఈరోజు స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.1,90,000 వద్ద కొనసాగుతోంది.