KMM: దీపావళి పండుగతో పాటు సదర్ ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై విజయం సాధించడానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అలాగే, యాదవ సమాజం అన్ని జాగ్రత్తల నడుమ సదర్ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరారు.