SKLM: శ్రీ కూర్మ గ్రామానికి చెందిన ఉపాధిహామీ వేతనదారు కలగ. దాలమ్మను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదివారం పలకరించారు. గత జూన్ 16న నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో దాలమ్మ ప్రదర్శించిన యోగా భంగిమ విశేష ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. శ్రీ కూర్మ క్షేత్ర దర్శనానంతరం మంత్రి దాలమ్మను ఆప్యాయంగా కలసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.