»Odisha Pharmacist Suspended For Clicking Selfies With Presidents Chopper
Photos తెచ్చిన చిక్కు.. రాష్ట్రపతి హెలికాప్టర్ వద్ద ఫొటో దిగిన వైద్యుడు సస్పెండ్
గుళ్లు, మందిరాలు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో ఫొటోలకు అనుమతి లేదు. ఇక వీవీఐపీల పర్యటనల సమయంలో కూడా ఫొటోలపై నిషేధం ఉంటుంది. అది పట్టించుకోకుండా ఫొటోలు దిగితే మీపై కఠిన చర్యలు తప్పవు.
ఓ సెల్ ఫోన్ (Mobile Phone) ఉంది కదా ఎక్కడ పడితే అక్కడ ఫొటోలు (Photos) తీసుకుంటామంటే కుదరదు. కొన్ని చోట్ల ఫొటోలు దిగడం నిషిద్ధం (Ban) అనే విషయం చాలా మందికి తెలియదు. గుళ్లు, మందిరాలు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో ఫొటోలకు అనుమతి లేదు. ఇక వీవీఐపీల (VVIPs) పర్యటనల సమయంలో కూడా ఫొటోలపై నిషేధం ఉంటుంది. అది పట్టించుకోకుండా ఫొటోలు దిగితే మీపై కఠిన చర్యలు తప్పవు. అలాంటి తప్పిదమే ఓ వైద్యాధికారి (Medical Officer) చేశాడు. దెబ్బకు అతడి ఉద్యోగం ఊడింది. హెలికాప్టర్ (Helicopter) వద్ద సెల్ఫీ (Selfie) దిగితే అతడిని ఉద్యోగం నుంచి తొలగించిన ఘటన ఒడిశాలో (Odisha) చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో (Mayurbhanj District) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) నాలుగు రోజుల పర్యటనకు వచ్చారు. పలు చోట్ల పర్యటించేందుకు గాను ఆమెకు వాయుసేన (Indian Navy) హెలికాప్టర్ ఏర్పాటుచేసింది. ఈ పర్యటన సమయంలో ఒకచోట వైద్యబృందంలోని అధికారి యశ్వంత్ బెహరా ఉన్నారు. ఆయన రాష్ట్రపతి ప్రయాణించే హెలికాప్టర్ ముందు సెల్ఫీ దిగాడు. ఒక్క ఫొటో అంటే ఏమో. కానీ పదుల సంఖ్యలో.. వివిధ స్టిల్స్ ఇస్తూ ఫొటోలు దిగాడు. అంతేకాకుండా ఆ ఫొటోలను అతడు తన ఫేస్ బుక్ లో (Facebook) పోస్టు చేశాడు. ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.
రాష్ట్రపతి భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉండడంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్రపతి ప్రయాణం వద్ద ఇలాంటివి చేయొద్దు. రాష్ట్రపతి పర్యటనలో భద్రత (Security) లోపించిందని విమర్శలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ఒడిశా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఫొటో తీసుకున్న యశ్వంత్ ను సస్పెండ్ (Suspend) చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక ఫొటో ఎన్ని చిక్కులకు దారి తీసిందో చూడండి.