ప్రకాశ: జిల్లాలోని కంభం మండలంలో దీపావళి ముందు సామాగ్రి దుకాణాలను ఆదివారం సీఐ మల్లికార్జున ఆకస్మికంగా సందర్శించారు. నిబంధనల ప్రకారం దుకాణాలు ఏర్పాటు చేశారా లేదా అని పరిశీలించి, దుకాణదారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, సేఫ్టీ ప్రికాషన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తదితర పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు.