చాలామంది హీరోలు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు చేస్తుంటే.. మెగా హీరోలు మాత్రం రీమేక్ సినిమాలకు మొగ్గు చూపుతున్నారు. రీ ఎంట్రీ తర్వాత చిరు చేసిన చిత్రాల్లో ఖైదీ నెం.150.. గాడ్ ఫాదర్ రీమేక్ చిత్రాలే. అలాగే పవన్ రీ ఎంట్రీ తర్వాత చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రీమేక్ సినిమాలే. ఇక ఇప్పుడు మరో రీమేక్‌కు సై అంటున్నాడట పవన్. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో.. మరో సినిమా వస్తే చూడాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అందుకు తగ్గట్టే ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో సినిమాను ప్రకటించాడు హరీష్ శంకర్.
కానీ ఈ సినిమా అనౌన్స్మెంట్ వరకే పరిమితమైంది. ఇప్పటి వరకు ఎలాంటి అప్టేట్ లేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనని.. ఆ మధ్యలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఏకంగా భగత్ సింగ్‌ను పక్కకు పెట్టేసి.. ముందుగా ఓ రీమేక్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఇప్పటికే తెలుగులో డబ్ అయినా సినిమా అని తెలుస్తుండడంతో.. ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు.
కోలీవుడ్ హీరో విజయ్ నటించిన ‘తేరీ’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగులో ‘పోలీసోడు’గా రీమేక్ అయింది. అయినా ఇప్పుడు పవన్ ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. రీసెంట్గా ‘హరిహర వీరమల్లు’ సెట్స్‌లో పవన్‌ను కలిశాడు హరీష్ శంకర్. ఈ సందర్భంగా ‘తేరి’ రీమేక్ మీద వర్క్ చేయాలని హరీష్‌కు కొన్ని ఐడియాలు చెప్పారట పవన్. అంతేకాదు స్క్రిప్ట్ రెడీ చేయటానికి మూడు నెలల సమయం కూడా ఇచ్చారట. దాంతో ప్రస్తుతం హరీశ్ అదే పనిలో ఉన్నాడని ఇండస్ట్రీ టాక్.
అన్నీ కుదిరితే వచ్చే ఏడాదిలో ఈ రీమేక్ ఉంటుందని అంటున్నారు. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. కొత్త సబ్జెక్ట్ పెట్టుకొని.. రీమేక్ అసరమా అని వాపోతున్నారు. పైగా ఇప్పటికే మిగతా స్టార్ హీరోల ఫ్యాన్స్.. రీమేక్ హీరో అని కామెంట్ చేస్తున్నారు. అయినా పవన్ మాత్రం రీమేక్ కావాలంటున్నారు. అన్నట్టు పవన్ లైన్లో ‘వినోదయ సీతం’ రీమేక్ కూడా ఉంది. మరి పవన్ ఈ రీమేక్‌లను నిజంగానే చేస్తాడా.. లేక కేవలం ప్రచారమేనా అనేది తెలియాల్సి ఉంది.