AP: విద్యార్థుల అస్వస్థతపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. 11 అంటే వైసీపీకి ఇష్టమని.. 11 మంది చనిపోయారంటే ఎలా అని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు సలహాలు ఇవ్వండని.. దుష్ఫ్రచారం చేయకండని సూచించారు. వైసీపీ హయాంలో 118 మంది విద్యార్థులు మరణించారని ఆరోపించారు. గతంలో విద్యార్థులు చనిపోతే వారి కుటుంబాలను పట్టించుకోలేదన్నారు.