KDP: విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ నాయకులతో 12 గంటలపాటు జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయి. ప్రధాన డిమాండ్లకు యాజమాన్యాలు అంగీకరించడంతో సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, వారికి నేరుగా ప్రభుత్వం జీతాలు చెల్లించడం వంటి అంశాలపై ఒప్పందం కుదిరింది.