Kohli shake hands: గంగూలీకి కోహ్లీ కరచాలనం..ఇక ముగిసిన లొల్లి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నిన్న జరిగిన మ్యాచులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆ మ్యాచుల తర్వాత విరాట్ కోహ్లీ, గంగూలీ కరచాలనం చేుసుకన్నారోచ్. ఆ వీడియోను మీరు కూడా చూడండి మరి.
శనివారం(మే 6న) అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మ్యాచులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరు స్టార్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, గంగూలీ కరచాలనం చేసుకుంటారా లేదా అని అభిమానులు ఆసక్తిగా చుశారు. ఆ క్రమంలో విరాట్ కోహ్లీ.. సౌరవ్ గంగూలీతో ఎట్టకేలకు కరచాలనం చేశాడు. దీంతో వీరి మధ్య ఉన్న వివాదం శనివారంతో ముగిసిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సౌరవ్ ఫ్యాన్స్ తో పాటు ఇటూ కోహ్లీ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఏప్రిల్ 15న ఈ ఇరు జట్ల మధ్య గేమ్ ముగిసిన తర్వాత కోహ్లీ.. గంగూలీ ఒకరినొకరు పలకరించుకోలేదు. ఆ క్రమంలో విరాట్ గంగూలీకి కరచాలనం ఇచ్చేందుకు విముఖత చూపారు. ఆ క్రమంలో వెలుగులోకి వచ్చిన వీడియో వివాదాస్పదమైంది. ఆ సంఘటన తర్వాత ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో కూడా చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచులో విరాట్ కోహ్లి (56 బంతుల్లో 55) చేయడం కోహ్లీ 7 వేల పరుగుల మైలురాయిని సాధించారు. మహిపాల్ లోమ్రోర్ (54 నాటౌట్ ఆఫ్ 29) కెరీర్లో అత్యుత్తమ నాక్ చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఇక తర్వాత ఛేధనకు దిగిన ఢిల్లీ ఆటగాళ్లు 16.4 ఓవర్లలోనే స్కోరును పూర్తి చేశారు.