Cricketer Rana Wife : భారత యువ క్రికెటర్, కోల్ కతా నైట్ రైడర్స్(KKR) జట్టు కెప్టెన్ నితీశ్ రాణా(Nithish Rana) భార్యకు చేదు అనుభవం ఎదురైంది. కారులో ప్రయాణిస్తుండగా ఇద్దరు పోకిరీలు వెంబడించారు.
Cricketer Rana Wife : భారత యువ క్రికెటర్, కోల్ కతా నైట్ రైడర్స్(KKR) జట్టు కెప్టెన్ నితీశ్ రాణా(Nithish Rana) భార్యకు చేదు అనుభవం ఎదురైంది. కారులో ప్రయాణిస్తుండగా ఇద్దరు పోకిరీలు వెంబడించారు. శుక్రవారం ఢిల్లీలో వెళ్తున్న ఆమెను వెంబడించి కారును ఉద్దేశపూర్వకంగా పలుమార్లు ఢీకొట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు వెంబడించిన వారిలో ఒకరిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 4వ తేదీన రాణా భార్య సాచి మర్వా(saachi marwah).. రాత్రి పని ముగించుకుని ఢిల్లీ(Delhi)లోని కీర్తి నగర్ కు కారులో బయల్దేరారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు బైకుపై వెంబడించారు. కారును అడ్డుకోవడానికి పదేపదే ప్రయత్నించారు. ఆపై ఉద్దేశపూర్వకంగా కారు(Car)ను పలుమార్లు ఢీకొట్టారు. గట్టిగా అరుస్తూ ఆమెను బెదిరించారు. సుమారు నాలుగు కిలోమీటర్ల(Kilometers) దూరం పాటు వారు సాచి మార్వా(saachi marwah) కారును ఫాలో అయ్యారు. భయపడిపోయిన సాచి మార్వా యువకుల ఫొటో(Photo) తీసి తనకు ఎదురైన అనుభవాన్ని ఇన్ స్టాగ్రామ్(Instagram) ఖాతా ద్వారా వెల్లడించారు.
ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను మార్వా ఇన్ స్టాగ్రామ్ లో వివరించారు. “నేను నా పనిపూర్తి చేసుకొని కారులో ఇంటికి బయలుదేరాను. కానీ ఉన్నట్టుండి ఈ ఫొటోలో ఉన్న యువకులు ఉద్దేశ్యపూర్వకంగా నా కారును వెంబడించారు. కారణం లేకుండానే కారు ఢీకొట్టడం మొదలుపెట్టారు. వీరి చర్యల పట్ల నేను చాలా ఇబ్బందిపడ్డా..” అని మార్వా రాసుకొచ్చింది. విషయం పోలీసుల(Police)కు చెబితే తేలికగా తీసుకున్నారని పేర్కొన్నారు. మీరు ఇప్పుడు సురక్షితంగా ఇంటి(House)కి చేరుకున్నారు కాబట్టి.. ఇక దానిని మర్చిపోమని సలహా ఇచ్చినట్లు తెలిపారు. అలాంటి సందర్భం మరోసారి ఎదురైతే వెహికల్ నంబర్(Vehicle Number)ను నోట్ చేసుకోవాలని చెప్పినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.