E.G: ఆర్య వైశ్య సమాజ సేవలో అగ్రగామిగా నిలిచిన కాకినాడకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సేవా తత్వవేత్త ప్రగలపాటి కనకరాజుకి విశిష్ట గౌరవం లభించింది. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఆయనను “జీవిత సాఫల్య పురస్కారం”కి ఎంపిక చేసినట్లు సంస్థ అంతర్జాతీయ అధ్యక్షులు వి.ఎన్. డైమండ్ ఎరుకుల్ల రామకృష్ణ మంగళవారం ప్రకటించారు.