KKD: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కాకినాడ కలెక్టరేట్లో వసతి గృహాల్లోని సదుపాయాలపై ఆయన సమీక్షించారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, తాగునీరు, అప్రోచ్ రోడ్లు, కాంపౌండ్ వాల్, విద్యుత్ కనెక్షన్ లపై దృష్టి పెట్టాలన్నారు