ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత(Olympic Gold medal Winner), మహిళా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ టోరీ బోవి(Tori Bowie) మృతిచెందారు. 32 ఏళ్ల ఆమె అమెరికాలోని ఫ్లోరిడాలో గల తన నివాసంలో విగతజీవిగా కనిపించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె మరణానికి గల కారణాలు తెలియలేదని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టోరి బోవి మరణవార్తను మేనేజ్ మెంట్ కంపెనీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత కొంతకాలంగా టోరీ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు సమాచారం. ఆమె మృతికి తోటి క్రీడాకారులు సంతాపం(Condolence) తెలియజేస్తున్నారు.
టోరి బోవి(Tori Bowie) మూడు సార్లు ఒలింపిక్ విజేతగా నిలిచింది. రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్ గా రికార్డు నెలకొల్పింది. ఆమె సాధించిన విజయాలను తలచుకుంటూ యూఎస్ఏటీఎఫ్ ఫెడరేషన్ సీఈవో మ్యాక్స్ సీగల్ సంతాపం వ్యక్తం చేశారు. 2013లో టోరి బోవి తన కెరీర్ ను ప్రారంభించింది. ఆమె అమెరికా తరపున 400 మీటర్ల రిలే విభాగంలో గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ 100 మీటర్ల టైటిల్ గెలిచిన రెండో అమెరికన్ మహిళగా టోరీ(Tori Bowie) రికార్డు నెలకొల్పింది.
లాంగ్ జంప్ లో ప్రపంచ నాలుగో స్థానంలో టోరి బోవి(Tori Bowie) నిలిచింది. 2019లో దోహా వేదికగా ప్రపంచ ఛాంపియన్ షిప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా పోటీపడి సెమీ ఫైనల్ వరకూ చేరుకుంది. ఈ ఈవెంట్ లో ఆమె నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ఆ టోర్నీ తర్వాత మళ్లీ ఆమె మరో అంతర్జాతీయ ఈవెంట్లో పాల్గొనలేదు. ఆమె మృతికి క్రీడాకారులు సంతాపం(Condolence) తెలుపుతున్నారు.