VSP: తూర్పు కోస్తా రైల్వే, వాల్తేరు డివిజన్‌కు చెందిన ఏడీఎఫ్‌ఎం జి. సతీష్ ప్రత్యేక ప్రచారం 5.0లో భాగంగా గాజువాక లోని దువ్వాడ రైల్వే స్టేషన్‌ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘అమృత సంవాద్’ కార్యక్రమంలో ఆయన ప్రయాణికులతో మాట్లాడారు. స్టేషన్ అభివృద్ధి, ప్రతిపాదిత సౌకర్యాలపై ప్రయాణీకుల అభిప్రాయాలు, సూచనలను ఆయన స్వీకరించారు.