నెల్లూరు రూరల్ ములుమూడిలో ఏపీ రైతు సంఘం 14వ జిల్లా మహాసభ సోమవారం జరిగింది. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పూడిపర్తి జనార్దన్, కార్యదర్శిగా మూలి వెంగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలు సరిగా లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతుల కోసం నిరంతరం ఉద్యమిస్తామన్నారు.