NRML: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించిన కలెక్టర్, మండలాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.