NLR: సీతారామపురం మండలం దేవమ్మచెరువులో రీసర్వే ఫీల్డ్ వెరిఫికేషన్ సోమవారం జరిగింది. ఆత్మకూరు డివిజన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారులు పి. శ్రీనివాస్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాస్ శర్మ పరిశీలించారు. తప్పులు లేకుండా రీసర్వే చేయాలని, ఏ రైతుకూ నష్టం జరగకుండా చూడాలని సర్వే అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా ఎంఎస్ శ్రీకాంత్, సర్వేయర్లు నిఖిల్, పాల్గొన్నారు.