SRCL: సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే మానవత్వాన్ని చాటుకున్నారు. సిరిసిల్లలోని బైపాస్‌లో గాయపడిన ఉన్న ఒక వ్యక్తిని అటుగా వెళుతున్న ఎస్పీ గమనించారు. వెంటనే ఎస్పీ తన పోలీస్ వాహనంలో గాయపడిన వ్యక్తిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం జిల్లా ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.