BDK: సుజాతనగర్ మండల కేంద్రంలో మరుగుదొడ్లు, బస్ షెల్టర్, నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రజల సౌకర్యార్ధం మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.10లక్షలు, మండల కేంద్రం, వేపలగడ్డ సెంటర్లో బస్ షెల్టర్ల నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ పనులను ప్రారంభించి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తెస్తానని ఆయన పేర్కొన్నారు.