BHPL: జిల్లా కేంద్రానికి చెందిన పలువురు నేతలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో TRP వ్యవస్థాపకుడు, MLC తీన్మార్ మల్లన్న సమక్షంలో పార్టీలో చేరారు. మల్లన్న మాట్లాడుతూ.. BC, SC, ST, మైనారిటీల అభివృద్ధికి కృషి చేయాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.