MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ ను మోసం చేసి, మూటలు తీసుకుపోయిన వారికి మళ్లీ పార్టీలో ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. సొంత తమ్ముణ్ని సర్పంచ్ పదవి కోసం చంపారని ఆరోపిస్తూ, ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కోసం తనను కూడా చంపే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.