TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన భర్త మాగంటి గోపీనాథ్‌ను తలుచుకుని కంటతడి పెట్టారు. రహమత్‌నగర్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. నియోజకవర్గంలోని ప్రజలు తమ కుటుంబాన్ని సొంత కుటుంబంగా భావిస్తున్నారని అన్నారు. ఆమె ప్రసంగిస్తుండగా అభిమానులు ‘జై గోపినాథ్’ అంటూ నినాదాలు చేశారు.