TG: సీఎం రేవంత్రెడ్డి అసభ్యంగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పేగులు మెడలో వేసుకుంటా అని తరచూ అంటున్నారని.. ఇలాంటి దివాలాకోరు సీఎంను ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. కారు కావాలా.. బుల్డోజర్ కావాలా అనేది ఇక్కడి ఓటర్లే తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు చేర్చారని ధ్వజమెత్తారు.