WGL: ఉమ్మడి జిల్లాలో వైన్స్ షాపుల టెండర్లకు మద్యం వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 11(శనివారం) వరకు 294 షాపులకు కేవలం 258 దరఖాస్తులు వచ్చాయి. సగటున ఒక షాపుకు ఒక దరఖాస్తు కూడా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం టెండర్ ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడంతో వ్యాపారులు మందకొడిగా ఉన్నట్లు తెలుస్తోంది.