కృష్ణా: దేశ విదేశాల్లోని ఐటీ నిపుణులు ఏపీలో ఐటీ సంస్థలు నెలకొల్పేందుకు అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యే రాము అన్నారు. కమ్ టు ఏపీ ప్రిఫర్ గుడివాడ అంటూ ఐటీ నిపుణులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాము నినాదించారు. అమెరికాలో ప్రిన్స్ స్టన్ ఐటీ సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్యే సోమవారం మాట్లాడుతూ.. ఐటి సంస్థలు ఏర్పాటు చేసేందుకు గుడివాడలో అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు.