ATP: రాయదుర్గం మండలం లింగాల బండ సమీపంలోని పశుపతి నాథ ఆలయాన్ని శృంగేరి విరూపాక్షి మఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీవిద్యాన నృసింహ భారతి మహాస్వాములతో కలిసి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దర్శించుకున్నారు. ఆలయంలో గుప్తనిధుల తవ్వకాల సమయంలో ధ్వంసమైన శివలింగం, నంది విగ్రహాల మరమ్మతులపై ఎమ్మెల్యే చర్చించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.