W.G: పాలకొల్లు పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు నాళం బాబి సతీమణి సురేఖ, క్షీరరామలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమితులైన సందర్భంగా రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఆమెకు శుభాకాంక్షలు తెలిపి, అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొల్లి కొండా ప్రసాద్, జక్కంపూడి కుమార్ సహా పలువురు పాల్గొన్నారు.