NGKL: సీఎం రేవంత్ రెడ్డి సొంత మండలం వంగూరులో రైతులందరికీ సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయడానికి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేశారు. దాదాపు 7,500 బోరు బావులకు రూ.258 కోట్లు ఖర్చు చేసి సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయనున్నారు. ‘పీఎం కుసుమ’ పథకంలో భాగంగా మండలంలో ప్రయోగాత్మకంగా పంపు సెట్లకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.