AP: గుప్తనిధుల తవ్వకాల కేసులో చిత్తూరు జిల్లా YCP జిల్లా కార్యదర్శి ఎర్రబెల్లి శ్రీనివాస్‌తో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు వీర్పల్లి అటవీప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తుండగా పోలీసులు దాడి చేశారు. ఘటనాస్థలంలో కారు, జేసీబీ, నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు పరారీలో ఉన్నారు. నిందితులు పుంగనూరు మండలం బంటుపల్లె వాసులుగా గుర్తించారు.