KMM: ఢిల్లీలో జరుగుతున్న ధర్నాకు సంఘీభావంగా ఖమ్మం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట శనివారం టాప్రా, ఏఐబీడీపీఏ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పెన్షన్ పెరుగుదల నిరోధక చట్టాన్ని ఉపసంహరించాలని నాయకులు నాగేశ్వరరావు, టి. శంకర్రావు డిమాండ్ చేశారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు 2017 నుంచి పెన్షన్ రివిజన్ జరగకపోవడం అన్యాయమని వారు పేర్కొన్నారు.