ప్రకాశం: కనిగిరిలోని సూరా పాపిరెడ్డి నగర్లో దివ్యాంగురాలు చియాద్రి బుజ్జి ఇంటి స్థలాన్ని కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దివ్యాంగుల హక్కుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డి.మల్లికార్జున డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని కనిగిరి DSPసాయి యశ్వంత్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు.