SRD: రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శోభన్ నాయక్ అన్నారు. సంగారెడ్డిలోని సంఘం భవనంలో శనివారం ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.