W.G: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుండి వర్చువల్గా ప్రారంభించిన చారిత్రాత్మక ‘ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకమును ఉండి కృషి విజ్ఞాన కేంద్రం నందు కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ శనివారం ప్రారంభించారు. ఏపీలో నాలుగు జిల్లాలను ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. ప్రతి ఏడాది రూ.24 వేల కోట్లు మొత్తం రూ.1.44 లక్ష కోట్లు రానున్నాయని తెలిపారు.