TG: తమ శాఖ, వరంగల్ జిల్లా రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పెత్తనం ఎక్కువైందని మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. పార్టీ అధ్యక్షుడు ఖర్గే కార్యాలయానికి ఫోన్ ద్వారా వారు ఫిర్యాదు చేశారని సురేఖ పీఆర్ఓ తెలిపారు. ముఖ్యంగా మేడారంలో జరుగుతున్న అభివృద్ధి టెండర్లలో పొంగులేటి జోక్యం చేసుకున్నారని ఆరోపించారు.