MNCL: 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణిని ఈ నెల 13 నుంచి యథావిధిగా కొనసాగించనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయ భవన సమావేశ మందిరంలో ప్రజావాణి యథావిధిగా ఉంటుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.