బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ 82 ఏళ్లు పూర్తి చేసుకొని ఇవాళ 83వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బిగ్ బీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా, టాలీవుడ్ స్టార్ ప్రభాస్ అమితాబ్ బచ్చన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బిగ్ బీతో వర్క్ చేయడం తన అదృష్టమని ఈ సందర్భంగా గుర్తు చేశారు.