ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) పార్టీ అధ్యక్ష పదవీకి రాజీనామా విషయంపై పునరాలోచన(Reconsider) చేస్తున్నట్లు ఆయన మేనల్లుడు అజిత్ పవార్ పేర్కొన్నారు. పవార్ రాజీనామాపై పునరాలోచనకు అంగీకరించారని, ఆయన రెండు మూడు రోజులు సమయం కావాలని చెప్పారని వెల్లడించారు.
అయితే అంతకు ముందు శరద్ పవార్ (Sharad Pawar) పార్టీ అధ్యక్ష పదవీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, పవార్ (Ajit Pawar) ఓ వర్గం ఏర్పాటు చేసి.. బీజేపీతో దోస్తి చేయడం శరద్ పవార్‌కు (Sharad Pawar) నచ్చలేదని పేర్కొన్నారు. అందుకే ఈ రోజు పార్టీ అధ్యక్ష పదవీకి రాజీనామా చేశారని అజిత్ పవార్ వెల్లడించారు.
శరద్ పవార్ (Sharad Pawar) తర్వాత పార్టీ అధ్యక్ష పదవీ ఎవరు చేపట్టాలనే అంశంపై కమిటీ ఏర్పాటు చేశామని అజిత్ పవార్ తెలిపారు. కమిటీ సమావేశమై.. తదుపరి అధ్యక్షుడిని ఎంపిక చేస్తుందని తెలిపారు. కమిటీ అంటే ఎన్సీపీ ఫ్యామిలీ అని అందులో కీలక నేతలు, శరద్ పవార్ (Sharad Pawar) కూతురు సుప్రియ సూలే, తాను ఉంటామని పేర్కొన్నారు. కమిటీ నిర్ణయాన్ని అమలు చేస్తామని శరద్ పవార్ (Sharad Pawar) ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు.