HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లిక్కర్ పంపిణీ కట్టడికి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రలోభాల కట్టడానికి కలిసికట్టుగా పనిచేయాలని, అన్ని శాఖల పరస్పర సమన్వయంతో ప్రలోభాలను కట్టడి చేయాలని సూచించారు.