TG: కొమురం భీమ్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. ఇటిక్యాల పహాడ్, నవేగావ్ పరిసరాల్లో పులి సంచరిస్తోందని, పొలంలో ఉన్న ఆవును చంపిందని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో భయాందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు.. ఒంటరిగా పొలాలకు వెళ్లే పరిస్థితి లేదని, అధికారులు పులిని పట్టి బంధించాలని కోరుతున్నారు.