CTR: కాణిపాకం స్వామి వారి దేవస్థానంలోని ఆస్థాన మండపంలో శుక్రవారం సంకటహర చతుర్థి వ్రతం నిర్వహించారు. ఈ వ్రతంలో పాల్గొంటే సకల కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకంతో దంపతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, దేవస్థానం ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణి నాయుడు, ఏఈవో రవీంద్రబాబు పాల్గొన్నారు.